BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
'ఈ ఏడాదే పెళ్లి చేద్దామనుకున్నాం.. కానీ, ఇంతలోనే..'- యుక్రెయిన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా యువకుడి తల్లిదండ్రులు ఏం చెప్పారు?
రమేయ ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆయన మరణించాడనే విషయం స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది.
‘మీ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ నన్ను డిజిటల్ అరెస్ట్ చేసి రూ.9 లక్షలు దోచుకున్నారు’
వాళ్లు ఆమెను బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల గురించి ప్రశ్నించారు. ఇది జరుగుతుండగానే ఆ కేసు చాలా తీవ్రమైనదని, ఆమె పెద్ద ఇబ్బందిలో పడవచ్చని పదే పదే గుర్తు చేశారు.
'మీ ప్రధాని కష్టమైన ప్రశ్నలకు ఎప్పుడు జవాబిస్తారు? 'అని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్
నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ‘‘ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత మీడియా ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానమివ్వరు?’’ అని ఓ జర్నలిస్టు అడుగుతుంటే మోదీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం ఓ వీడియోలో కనిపిస్తోంది. తరువాత భారత విదేశాంగ శాఖ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సదరు జర్నలిస్టు, మంత్రిత్వశాఖ కార్యదర్శి మధ్య వాగ్వాదం జరిగింది.
ఒడోమా పిగే-స్వాచ్: ఈ కంపెనీల వాచ్ కోసం జనం ఎలా ఎగబడ్డారంటే...
వాచ్ కోసం జనం భారీగా రావడంతో బ్రిటన్‌లోని కొన్ని షాపింగ్ సెంటర్లలో భద్రత దృష్ట్యా కొన్ని రిటైల్ షాపుల్ని మూసివేయాల్సి వచ్చింది. విదేశాల్లోనూ షాపుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది.
వీడియో, డ్రైవర్ లెస్ కార్లన్నీ ఒకే చోట ఎందుకు చక్కర్లు కొడుతున్నాయంటే.., వ్యవధి 0,40
అమెరికాలోని అట్లాంటాలో వేమో సంస్థకు చెందిన ఈ డ్రైవర్‌లెస్ కార్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మే 15 ఉదయం ఇక్కడ చిక్కుకుపోయాయి.
పీసా టవర్: శతాబ్దాలుగా ఒరిగి ఉంటున్నా ఎందుకు పడిపోదు?
నెదర్లాండ్స్‌లోని 'డ్యాన్సింగ్ హౌసెస్' నుంచి చైనాలోని 'టైగర్ హిల్ పగోడా' వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఒరిగి ఉన్న కట్టడాలు చాలానే ఉన్నాయి.
'సెక్స్ వర్కర్ని, అంతమాత్రాన నన్ను రేప్ చేసే అధికారం వాళ్లకు ఉంటుందా?'
"మీడియా కెమెరాలు మా ఇంటివరకూ వచ్చాయి. ఏం జరిగిందో మా బస్తీ మొత్తానికి తెలిసిపోయింది. తప్పనిసరి పరిస్థితుల వల్ల కొన్ని రోజుల క్రితమే నేను సెక్స్ వర్కర్‌గా మారాను.ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం తెలియదు. ఇప్పుడు ప్రజలు నా మీద జరిగిన దారుణం గురించి కాకుండా, నా పని గురించి మాట్లాడుతున్నారు’’
‘దయ చూపు రఘునందనా..' అంటూ హిందూ ప్రజలు ఓ ముస్లిం పాలకుడి కోసం ఎందుకు ప్రార్థించారు?
''ఆ సమయంలో నవాబ్ వాజిద్ అలీ షాను సాగనంపడానికి అవధ్ నుంచి చాలా మంది కాన్పూర్‌కు వెళ్లారు. వారిలో చాలా మంది 'హజ్రత్ లండన్‌కు వెళ్తున్నారు, మాపై దయ చూపు రఘునందనా..' అని పాటలు పాడారు'' ఒక ఇస్లాం మతాన్ని అనుసరించే పాలకుడి హక్కుల కోసం, హిందూ ప్రజలు తమ దేవుడిని ప్రార్థించడం గంగా-యమునా సంస్కృతికి ఒక విశిష్ట ఉదాహరణగా నిలిచింది.
'సూసైడ్ డాల్ఫిన్స్’: అమెరికాతో యుద్ధంలో ఇరాన్ వీటిని వాడుతోందన్న అనుమానాలేంటి?
‘‘ఈ డాల్ఫిన్లు ఆత్మాహుతి దళంలాగా పని చేస్తాయి. ఓడ బయటి భాగాన్ని తాకగానే పేలిపోయే మందుపాతరలను మోసుకెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు నౌకలపై దాడి చేస్తాయి’’
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































